Siddaramaiah : రామనగర పేరు మార్పు వ్యవహారంపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. రామనగర పేరును బెంగళూర్ సౌత్గా మార్చడం పట్ల కాషాయ పార్టీ భగ్గుమన్న నేపధ్యంలో ఈ వివాదంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నేతృత్వంలో రామనగర జిల్లా నేతలు తనను కలిసి రామనగర పేరును బెంగళూర్ సౌత్గా మార్చాలని కోరారని తెలిపారు.
ఈ విషయంలో క్యాబినెట్ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఈ ప్రతిపాదనను క్యాబినెట్ ముందుంచుతామని తాను వారికి చెప్పానని సీఎం వివరించారు. ఇక కర్నాటక ప్రభుత్వం రామనగర పేరును బెంగళూర్ సౌత్గా మార్చాలని కసరత్తు సాగించడం పట్ల బీజేపీ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ హిందూ విద్వేషం, రాముడిపై వ్యతిరేకత ఇప్పుడు పతాకస్ధాయికి చేరిందని ఈ వ్యవహారంపై స్పందిస్తూ బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ఆరోపించారు.
రామజన్మభూమి ఉద్యమాన్ని తాము ఓడించామని రాహుల్ గాంధీ ఇటీవల చెప్పారని, ఇప్పుడు డీకే శివకకుమార్ శ్రీరాముడి పేరు ఉందని రామనగర్ పేరును ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఇలా ఎంతకాలం హిందువులను వేధిస్తుందని ఆయన ప్రశ్నించారు. హిందుత్వపై కాంగ్రెస్ విద్వేషం విరజిమ్ముతోందని పూనావాలా ఆరోపించారు.
Read More :
Earthquake | మహారాష్ట్రను వణికించిన స్వల్ప భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు