బెంగళూరు: శాసనసభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహించి కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళినీ కుమార్ రాజీనామా చేసి ఉండాల్సిందని ఆ పార్టీ నేత రేణుకాచార్య వ్యాఖ్యానించారు. ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకునేందుకు, కొందరికి ఆత్మ ఉందో, లేదో తనకు తెలియదన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నిక కూడా గెలవని నాయకులు కర్ణాటక నేతలకు మార్గనిర్దేశనం చేస్తున్నారన్నారు. ‘అన్నామలై(తమిళనాడు బీజేపీ చీఫ్, మాజీ ఐపీఎస్) పెద్ద హీరోనా? తమకు సెల్యూట్ చేసిన వ్యక్తి మాటలను మాజీ సీఎంలు వినాల్సి వస్తున్నది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలుపునకు ఇక్కడి నాయకులు ఏం చేశారని పరోక్షంగా బీఎల్ సంతోష్‌ను విమర్శించారు.