బెంగళూరు, జులై 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటక చరిత్రలో మొదటి సారిగా విపక్ష నేతలు లేకుండా సోమవారం శాసన సభ, శాసన మండలి సమావేశాలు మొదలయ్యాయి. ఆదివారం విపక్ష నేతలు, చీఫ్ విప్ల ఎంపిక జరగాల్సి ఉన్నా ఎన్సీపీని నిట్టనిలువుగా చీల్చటంలో తలమునకలైన కమలనాథులకు కర్ణాటక కనిపించలేదు.
మంగళవారం బీజేపీ శాసనసభా పక్ష నేతల ఎంపిక ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే మాజీ మంత్రి గోపాలయ్య నిందితుడిగా ఉన్న మొలాసిస్ అక్రమ ఎగుమతి కేసులో జాప్యంపై లోకాయుక్త ఎస్పీకి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.