న్యూఢిల్లీ, మే 12: పాకిస్థాన్‌తో భారత్ సాగించిన యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్నా ప్రధాని మోదీ తన ప్రసంగంలో అమెరికాను కాని, ట్రంప్‌ను కాని ఎందుకు ప్రస్తావించలేదని రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సోమవారం ప్రశ్నించారు. కాల్పుల విరమణపై కుదిరిన అవగాహన గురించి కూడా ప్రధాని వివరణ ఇవ్వలేదని తెలిపారు. మోదీ సోమవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగాన్ని సిబల్ ప్రస్తావిస్తూ సాయుధ దళాల పరాక్రమాన్ని తాము కీర్తిస్తామని, పాకిస్థాన్‌కు దీటుగా జవాబిచ్చినందుకు దేశ ప్రజలంతా సాయు ధ దళాలకు జైకొడతారన్నారు. కాల్పుల విరమణకు తాము మధ్యవర్తిత్వం వహించామ ని ట్రంప్ చేసిన ప్రకటనను గుర్తు చేశారు. భారత్, పాక్ మధ్య అణు యుద్ధాన్ని తాము ఆపామని, యుద్ధాన్ని ఆపితే పెద్ద ఎత్తున వా ణిజ్యం చేస్తామని కూడా తాను రెండు దేశాలకు చెప్పానని ట్రంప్ ప్రకటించారని చెప్పా రు. అమెరికాను, ట్రంప్‌ను ప్రధాని ప్రస్తావించకపోవడాన్ని సిబల్ ప్రశ్నించారు.
ముంబయి, మే 12: ద్వైపాక్షిక అంశమైన కశ్మీర్ విషయంలో మూడో పక్షాన్ని ఎందుకు అనుమతించాల్సి వచ్చిందో ప్రధాని మోదీ చెప్పాలని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ డిమాండ్ చేశారు. మోదీ సర్కారు కాల్పుల విరమణకు అంగీకరించిన తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. ముంబయిలో మీడియాతో మాట్లాడారు. ‘మన దేశానికి సంబంధించిన అంశంపై అమెరికా బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఇరుదేశాల ప్రధానుల సమక్షంలో సిమ్లా ఒప్పందం జరిగింది. దాని ప్రకారం కశ్మీర్ విషయంలో మూడో పక్షానికి చోటులేదు. కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్టు పార్లమెంట్ స్పెషల్ సెషన్‌కు నేను వ్యతిరేకం కాదు. కానీ, మిలటరీ అనేది సున్నిత అంశం. అన్ని విషయాలు బహిర్గతం చేయలేరు. అందుకే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడమే సబబు’ అని పవార్ పేర్కొన్నారు.
చండీగఢ్, మే 12: భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతునాన ముందు జాగ్రత్త చర్యల్లో భాగం గా పంజాబ్‌లోని అమృత్సర్, హోషియాపూర్ జిల్లాల్లో సోమవారం బ్లాకౌట్ (లైట్లు ఆర్పివేసి చీకటిగా చేయడం) పాటించారు. పంజాబ్ రాష్ట్రం పాకిస్థాన్‌తో 553 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నది. దీంతో పాక్ దాడులకు తొలుత పంజాబ్యే లక్ష్యం గా మారే అవకాశం ఉండటంతో కాల్పుల విరమణకు ముందు బ్లాకౌట్ ఆదేశాలను అధికారులు జారీ చేశారు. జలంధర్‌లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాను నిలిపివేసినట్టు ప్రకటించారు. సురనాస్సి పరిసర ప్రాంతాల్లో డ్రోన్ల కదలికలున్నట్టు అనుమా నం కలగడంతో ముందు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో బ్లాకౌట్ పాటించారు. కాగా, పంజాబ్ సరిహద్దులోని పలు ప్రాంతాల్లో సోమవారం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్లు యథావిధిగా పనిచేశాయి. చాలా చోట్ల ఇంకా పాఠశాలలను మూసివేసే ఉంచారు.
తిరువనంతపురం: కశ్మీర్ విషయంలో మూడో దేశం మధ్యవర్తిత్వం నిజమో కాదో కేంద్రం స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఒకవేళ మూడో దేశానికి మధ్య వర్తి త్వ అవకాశం ఇస్తే అది సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టేనని తెలిపింది. కశ్మీర్ అం శం, భారత్-పాక్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిత్యం ప్రకటనలు చేస్తుండటంతో ఈ విషయమై స్పష్ట త ఇవ్వాలని ఆ పార్టీ అడిగింది. సోమవారం తిరువనంతపురంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ దేశ విదేశాంగ విధానంలో ఏమైనా మార్పు వచ్చి ఉంటే ఆ విషయంపై వీలైనంత త్వరగా పార్లమెంట్ లో చర్చించాలన్నారు. ‘కశ్మీర్ విషయంలో మూడో పార్టీ జోక్యాన్ని తిరస్కరించే సిమ్లా ఒప్పందం ఉల్లంఘనకు గురైందా?’ అని వేణుగోపాల్ ప్రశ్నించారు.