లక్నో: పోలీస్ స్టిక్కర్ ఉన్న వాహనాన్ని కన్వారియాలు ధ్వంసం చేశారు. (Kanwariyas Vandalise Vehicle) ఆ తర్వాత ఆ వాహనాన్ని ఎత్తి బోల్తా పడేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కన్వారియాల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ- మీరట్ రోడ్డులోని దుహై సమీపంలో కన్వారియాల కోసం రిజర్వు చేసిన మార్గంలోకి ఒక వాహనం వచ్చింది. పోలీస్ స్టిక్కర్ ఉన్న ఆ వాహనం ఒక కన్వారియాను రాసుకుని వెళ్లింది. దీంతో వారు ఆగ్రహంతో రగిలిపోయారు. కర్రలతో ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత దానిని ఎత్తి ఒక పక్కకు పడేశారు.
కాగా, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేశారు. ధ్వంసమైన వాహనం పోలీస్ విభాగానికి చెందినది కాదని తెలిపారు. పవర్ కార్పొరేషన్‌లోని విజిలెన్స్ డిపార్ట్మెంట్ కోసం ఆ ప్రైవేటు వాహనాన్ని వినియోగిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఆ వాహనం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు కన్వారియాలు ఘజియాబాద్‌లో వాహనాలను ధ్వంసం చేయడం ఇది రెండోవది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కన్వారియాల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. వాహనాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
पुलिस कांवड़ियों का स्वागत कर रही
कांवड़िए गाड़ियों पर रोज लट्ठ बजा रहे📍गाजियाबाद, उत्तर प्रदेश https://t.co/NZT2jpPL5j pic.twitter.com/RZVXJZNOpE
— Sachin Gupta (@SachinGuptaUP) July 29, 2024