ఓటింగ్ గోప్యతను ఉల్లంఘించారంటూ కాన్పూర్ మేయర్‌పై ఎఫ్ఐఆర్
కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే వివాదంలో ఇరుక్కున్నారు. ఆమె తన ఓటు హక్కును వినియోగించే సందర్భంగా పోలింగ్ బూత్ లోపల ఫొటోలు తీశారన్నది అభియోగం. ఇక ఓటు వేసే సందర్భంలో ఈవీఎం ఫొటోలను కూడా ఆమె షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కాన్పూర్‌లోని హడ్సన్ స్కూల్లో మేయర్ ప్రమీలా పాండే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓటు వేస్తున్న వీడియోలను, పోలింగ్ బూత్ లోపలి వీడియోలను వాట్సాప్‌లో షేర్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా ఓటు గోప్యత దెబ్బతింటుందని, ఆమె ఏ పార్టీకి ఓటు వేశారో అందులో తెలిసిపోతోందని అధికారులు పేర్కొంటున్నారు. ఓటు హక్కును వినియోగించుకుంటున్న సందర్భంలో ఈవీఎం ఫొటోలు తీయడం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా భావిస్తారు.
దీనిపై స్థానిక అధికారులు స్పందించారు. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ‘హడ్సన్ స్కూల్ పోలింగ్ స్టేషన్లో మేయర్ ఓటింగ్ గోప్యతను ఉల్లంఘించారు. దీంతో సంబంధిత సెక్షన్ల కింద ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం’ అని జిల్లా మేజిస్ట్రేట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

