లక్నో : ఓ మేక చేసిన పనికి ప్రభుత్వ ఉద్యోగులకు చెమటలు పట్టాయి. ప్రభుత్వ కార్యాలయంలోకి ప్రవేశించిన మేక.. మెల్లగా అక్కడున్న ఓ దస్త్రాన్ని ఎత్తుకెళ్లింది. దీంతో ఓ ఉద్యోగి దాని వెనుకాలే పరుగెత్తాడు. ఈ ఘటన యూపీ కాన్పూర్‌లోని చౌబేపూర్ బ్లాక్ ఆఫీసులో బుధవారం చోటు చేసుకుంది. ఇక ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. ఆ మేక సోషల్ మీడియా స్టార్‌గా నిలిచిపోయింది.
చౌబేపూర్ బ్లాక్ ఆఫీసులోకి బుధవారం ఓ మేక ప్రవేశించింది. క్యాంటిన్‌కు సమీపంలో ఉన్న ఓ గదిలోకి వచ్చిన మేక.. అక్కడున్న ఓ దస్త్రాన్ని నోటితో పట్టుకుని బయటకు వచ్చింది. కాసేపు అక్కడే నిల్చున్న మేక.. అనంతరం అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గమనించిన ఓ ఉద్యోగి ఆ దస్త్రం కోసం మేక వెంట పరుగెత్తాడు. చివరకు మేక నోట్లో ఉన్న ఫైల్‌ను ఉద్యోగి దొరికించుకున్నాడు. అది అధికారిక ఫైల్ కాదు.. మామూలు కాగితమే అని తేలడంతో ఉద్యోగులందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లే మేక.. కార్యాలయంలోకి ప్రవేశించిందని బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ మనులాల్ యాదవ్ పేర్కొన్నారు.
कानपुर में बकरी सरकारी फ़ाइल चबाती भागी… पीछे अधिकारी भागा…
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) December 3, 2021
बकरी से फ़ाइल वापस ले पाया कि नहीं पता नहीं 😂 pic.twitter.com/QBD2owEoe8