బెంగళూరు: కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్శన్, పవిత్ర గౌడ, ఇతరులు కలిసి రేణుకాస్వామిపై అత్యంత కర్కశకంగా దాడికి తెగబడినట్టు పోస్ట్‌మార్టం నివేదిక చెబుతున్నది. హత్యకు ముందు రేణుకాస్వామికి కరెంట్ షాక్ ఇచ్చి..చిత్ర హింసలకు గురిచేసినట్టు తెలిసింది. ఇటీవల అరెస్టు చేసిన కేబుల్ వర్కర్ ధన్‌రాజ్‌ను విచారించగా ఈ విషయాలు బయటకు వచ్చాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. బాధితుడి శరీరంపై 39 గాయాలుండగా, ఏడు చోట్ల కాలిన గాయాలున్నాయని పోలీసులు గుర్తించారు.