బెంగళూరు: హత్య కేసులో నిందితుడు, కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో సకల రాజ భోగాలు అందుతున్నట్లు ఓ ఫొటోను బట్టి తెలుస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ ఫొటోను జైళ్ల శాఖ పరిగణనలోకి తీసుకుని, ఈ జైలు అధికారులకు సమన్లు జారీ చేసింది. ఫొటోలో కనిపిస్తున్న దానిని బట్టి, దర్శన్ జైలులోని ఓ పార్కులో జల్సాగా ఉన్నారు. ఏదో పానీయం తాగుతూ, సిగరెట్ కాల్చుతున్నారు. ఆయనతోపాటు కొందరు రౌడీ షీటర్లు కూడా పక్కన కనిపిస్తున్నారు.