ప్రధాని పర్యటనలో భద్రతా లోపం సిగ్గుచేటు : కంగనా రనౌత్
Kangana Ranaut | పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం చేదు అనుభవం ఎదురైంది. రైతుల నిరసన కారణంగా ఆయన కాన్వాయ్ ఫ్లై ఓవర్ వద్ద 15 నుంచి 20 నిమిషాల పాటు నిలిచిపోయిన విషయం

న్యూఢిల్లీ : పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం చేదు అనుభవం ఎదురైంది. రైతుల నిరసన కారణంగా ఆయన కాన్వాయ్ ఫ్లై ఓవర్ వద్ద 15 నుంచి 20 నిమిషాల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ భద్రతా లోపానికి పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఘటనపై బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఘాటుగా స్పందించింది. పంజాబ్‌ను ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా అభివర్ణించింది. ప్రధాని పర్యటనలో భద్రతా లోపం సిగ్గుచేటని పేర్కొంది.
ప్రధానమంత్రి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నాయకుడని, 140 కోట్ల ప్రజల గొంతుకని, ఆయనపై దాడి అంటే దేశంలోని ప్రతి పౌరుడిపై దాడి జరిగినట్లేనంది. ఘటన మన ప్రజాస్వామ్యంపై దాడేనని, పంజాబ్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోందని పేర్కొంది. వాటిని ఇప్పటికైనా ఆపకపోతే దేశానికి పెద్ద నష్టం తప్పదని ఇస్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా ‘భారత్ స్టాండ్ విత్ మోదీ జీ’ అనే హ్యాష్‌ట్యాగ్ జోడించగా.. కంగనా స్పందనపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

