Kamal Haasan | బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. బీహార్లో బీజేపీ 89 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. 243 స్థానాల అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి 202 స్థానాలను గెలుచుకుంది. ఈ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ స్పందించారు. విజేతలు దీన్ని విజయంగా చూస్తారు.. అది నిజాయితీగా జరిగిందో లేదో.. మేము అంచనా వేస్తాం అన్నారు. తమిళనాడు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఈవీఎంలో కొంత అవకతవకలు జరిగే అవకాశం ఉందన్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మనం జాగ్రత్తగా ఉండాలి.
తమిళనాడు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. నేను చెప్పగలిగేది అంతే’ అన్నారు. ఈ సందర్భంగా ‘సర్’ అంశంపై సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంది. నా పరిమితుల్లో నేను చేయగలిగినది చేస్తున్నాను. అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నా వినయపూర్వక అభ్యర్థన’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజ్ను చేపట్టనున్నది. ఓటర్ల జాబితాలను అప్డేట్ చేసేందుకు దేశవ్యాప్తంగా చేస్తున్న ప్రయత్నంలో భాగంగా తమిళనాడులో సవరణ ప్రక్రియను ప్రారంభిస్తామని ఈసీ మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. సవరణ ప్రక్రియను సజావుగా కొనసాగించడానికి, కమిషన్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధాన ఎన్నికల అధికారులతో ఈ ప్రక్రియను చర్చించిందని చెప్పింది. ఇదిలా ఉండగా.. కమల్ హసన్ సినిమాల విషయానికి వస్తే చివరిసారిగా ‘థగ్ లైఫ్’ మూవీలో కనిపించారు. కేహెచ్ 237, విక్రమ్-2, కల్కీ మూవీల్లో నటించనున్నారు.
VIDEO | Chennai: “Winners would view it as victory, we assess if it came honestly,” says Makkal Needhi Maiam party leader Kamal Haasan on Bihar state Assembly poll results.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7)#BiharElectionsWithPTI… pic.twitter.com/WdNKBqTeYp
— Press Trust of India (@PTI_News) November 15, 2025