Kamakhya Express Derail | ఒడిశాలో ఆదివారం రైలు ప్రమాదం జరిగింది. కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు పట్టాలు. తప్పాయి. కటక్‌లోని నెర్గుండి రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే, రైలు పట్టాలు తప్పడానికి కారణాలు తెలియరాలేదు. రైలు నంబర్ 12251 బెంగళూరు నుంచి అసోంలోని గువహటిలోని కామాఖ్య స్టేషన్‌కు వెళుతోంది. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు మరో రైలును ఏర్పాటు చేసినటట్లు పేర్కొంది. ఆదివారం ఉదయం 11.54 గంటల ప్రాంతంలో ఎస్ఎంవీటీ బెంగళూరు-కామాఖ్య ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలు 11 బోగీలు పట్టాలు తప్పినట్లుగా ఓ అధికారి పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన ఏడుగురిని ఆసుపత్రికి తరలించినట్లు ఒడిశా అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ సుధాంషు సారంగి తెలిపారు.
#WATCH | Cuttack, Odisha: 11 coaches of 12551 Bangalore-Kamakhya AC Superfast Express derailed near Nergundi Station in Cuttack-Nergundi Railway Section of Khurda Road Division of East Coast Railway at about 11:54 AM today. There are no injuries or casualties reported till now. pic.twitter.com/Xgat62XFEk
— ANI (@ANI) March 30, 2025
సహాయ చర్యలో ఎన్డీఆర్ఎఫ్, ఒడిశా అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం నేపథ్యంలో 8455885999, 8991124238 నంబర్లతో హెల్ప్లైన్లు ప్రారంభించింది. రైలు ప్రమాదం నేపథ్యంలో మూడు రైళ్లను మళ్లించినట్లు పేర్కొన్నారు. ధౌలి ఎక్స్‌ప్రెస్, నీలాచల్ ఎక్స్‌ప్రెస్, పురులియా ఎక్స్‌ప్రెస్‌ని ఇతర మార్గాల్లో మళ్లించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్ఓ అశోక్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. 12551 కామాఖ్య సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని కోచ్‌లు పట్టాలు తప్పినట్లు మాకు సమాచారం అందిందని.. 11 ఏసీ కోచ్‌లు పట్టాలు తప్పినట్లు సమాచారం ఉందన్నారు. డీఆర్ఎం ఖుర్దా రోడ్, జనరల్ మేనేజర్, ఈసీఓఆర్తో సహా ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, రైలు పట్టాలు తప్పడానికి కారణాలు ఇంకా తెలియరాలేదని.. దీనికి కారణాలు తెలుసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. కామాఖ్య ఎక్స్‌ప్రెస్ ప్రమాదం గురించి సమాచారం అందిందని.. దీనిపై ఒడిశా ప్రభుత్వం, రైల్వేశాఖతో సంప్రదిస్తున్నట్లు అసోం సీఎం తెలిపారు.
#WATCH | Cuttack, Odisha: 11 coaches of 12551 Bangalore-Kamakhya AC Superfast Express derailed near Nergundi Station in Cuttack-Nergundi Railway Section of Khurda Road Division of East Coast Railway at about 11:54 AM today. There are no injuries or casualties reported till now. pic.twitter.com/xBOMH4nRRh
— ANI (@ANI) March 30, 2025