భుబన్ బద్యాకర్ అనే పేరు కన్నా.. కచ్చా బాదమ్ సాంగ్ సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సాంగే ట్రెండింగ్లో ఉంటోంది. సరదాగా.. పల్లీలు అమ్ముకుంటూ కచ్చా బాదమ్ అంటూ పాటలు పాడుకునే భుబన్ బద్యాకర్.. ఓవర్ నైట్ సెలబ్రిటీ అవుతానని కలలో కూడా ఊహించి ఉండడు. ఇప్పుడు ఆయన పెద్ద సెలబ్రిటీ. ఆయనతో పాటలు పాడించేందుకు చాలామంది క్యూ కడుతున్నారు. సంపాదన కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.
తాజాగా కోల్కతాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో భుబన్ బద్యాకర్ కచ్చా బాదమ్ పాటను మరోసారి పాడి వినిపించాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఆ పాటకు స్టెప్పులేశారు. ఆయనతో కలసి కోరస్ అందించారు. టీషర్ట్, జీన్స్ వేసుకొని వచ్చిన భుబన్.. స్టేజ్ ఎక్కి కచ్చా.. బాదమ్ అని పాట పాడేసరికి అందరూ ఉర్రూతలూగారు.