విమానాల్లో సాంకేతిక లోపాలు.. నివేదిక కోరిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ : కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విమానాల్లో భద్రతా సమస్యలపై మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)తో చర్చించారు. ఈ సందర్భంగా గత నెల రోజుల్లో జరిగిన ఘటనకు సంబంధించి అధికారుల నుంచి వివరణ కోరారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీపడొద్దని అధికారులను ఆదేశించారు.
ఇటీవల కాలంలో ఇండియన్ ఏయిర్‌లైన్స్‌కు చెందిన విమానాల్లో సాంకేతిక సమస్యలు ఎక్కువయ్యాయి. దీని కారణంగా విమానాలను మళ్లించడం లేదంటే అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం వంటి ఘటనలు పెరిగాయి. గత 48 గంటల్లో మూడు అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమానాలను భారత్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశాయి. సాంకేతిక కారణాలతోనే విమానాలను అత్యవసరంగా దింపాల్సిన పరిస్థితి ఎదురైంది.
ఒకే రోజు రెండు ఘటనలు
కరాచీలో ఆదివారం ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయిన కొన్ని గంటల తర్వాత.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి సైతం ప్రమాదం తప్పింది. కేరళలోని కాలికట్ నుంచి దుబాయి వెళ్తున్న విమానంలో ఒక్కసారిగా క్యాబిన్లో కాలిన వాసన వచ్చింది. దీంతో వెంటనే విమానాన్ని మస్కట్ వైపు మళ్లించారు. బహ్రెయిన్-కొచ్చి మధ్య ప్రయాణిస్తోన్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లోకి పిచ్చుక ప్రవేశించింది. విమానం కాక్‌పిట్‌లో సజీవంగా ఉన్న ఓ పక్షి కనిపించింది.
ఆదివారం షార్జా నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతికలోపం కారణంగా పాకిస్తాన్ కరాచీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించడంతో ముందుజాగ్రత్తగా విమానాన్ని కరాచీ వైపు మళ్లించినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. ప్రయాణికులను హైదరాబాద్‌కు తరలించేందుకు అదనంగా మరో విమానాన్ని కరాచీకి పంపుతున్నట్లు పేరొంది. రెండు వారాల్లో కరాచీలో దిగిన రెండో భారతీయ విమానమిది. ఇటీవల కాలంలో స్పైస్‌జెట్ విమానాల్లో ఎనిమిది సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. వీటిపై డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రస్తుతం ఆయా ఘటనపై డీజీసీఏ దర్యాప్తు చేస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

