Supreme Court | జస్టిస్ యశ్వంత్ వర్మకు సర్వోన్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను గురువారం తిరస్కరించింది. త్రిసభ్య విచారణ కమిటీ దర్యాప్తు నివేదికను సవాల్ చేసిన జస్టిస్ యశ్వంత్ శర్మ సవాల్ చేశారు. ఆయన ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో జస్టిస్ వర్మపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అంతర్జగత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు జడ్జిలతో గతంలో కమిటీని ఏర్పాటు చేశారు. జస్టిస్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు దొరికింది వాస్తవమేనని త్రిసభ్య కమిటీ తేల్చి.. ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది. అయితే, కమిటీ దర్యాప్తు నివేదికను ఆయన సవాల్ చేశారు. పిటిషన్ను తిరస్కరించిన కోర్టు.. జస్టిస్ వర్మ ప్రవర్తన విశ్వాసాన్ని కలిగించదని.. ఆయన పిటిషన్ను విచారణకు పరిగణలోకి తీసుకోకూడదని ధర్మాసనం పేర్కొంది.
ఈ కేసులో అప్పటి అప్పటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పంపిన లేఖ రాజ్యాంగ విరుద్ధం కాదని సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు వచ్చిన సమయంలో పెద్ద మొత్తంలో కాలిపోయిన నోట్ల కట్టలు, సగం కాలిన నోట్లు కనిపించాయి. ఈ ఘటన తర్వాత జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అంతర్గత దర్యాప్తు కోసం ఆదేశించింది. అయితే, విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, ఓ స్టోర్ రూమ్లో నోట్ల కట్టలు ఉన్నాయని.. అది న్యాయమూర్తి నివాసంలో భాగమేనని తేల్చింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కమిటీ బదిలీకి మించిన చర్యలు తీసుకోవాలని కోరింది. త్రిసభ్య కమిటీ చెల్లుబాటును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు తిరస్కరించింది.