న్యూఢిల్లీ : అక్రమ నగదు వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఎలాంటి హడావిడి లేకుండా ఒక సాధారణ ప్రైవేట్ చాంబర్లో ఆయన ప్రమాణ స్వీకారాన్ని ముగించినట్టు అధికారులు తెలిపారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా యశ్వంత్ వర్మకు ప్రస్తుతానికి ఎలాంటి న్యాయపరమైన విధులనూ సుప్రీంకోర్టు కేటాయించలేదు. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ అలహాబాద్ బార్ అసోసియేషన్ నిరవధిక సమ్మెను ప్రకటించగా, సుప్రీంకోర్టు సీజేఐ సంజీవ్ ఖన్నా ఇచ్చిన హామీతో అసోయేషన్ తమ సమ్మె ఆలోచనను విరమించుకుంది.