న్యూఢిల్లీ : 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగిసిన నేపథ్యంలో, తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు అందుకోబోతున్నారు.
ఈ పదవిలో ఆయన 2027 ఫిబ్రవరి 9 వరకు, దాదాపు 15 నెలల వరకు కొనసాగుతారు. హర్యానాలోని హిస్సార్ జిల్లాకు చెందిన సూర్యకాంత్ ఓ మధ్య తరగతి కుటుంబంలో 1962 ఫిబ్రవరి 10న జన్మించారు. కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రం మాస్టర్స్ డిగ్రీలో టాపర్గా నిలిచారు.