కోల్కతా, సెప్టెంబర్ 13: కోల్కతాలోని ఆర్జీ కర్ దవాఖాన సంక్షోభంపై జోక్యం చేసుకోవాలని నెల రోజులకు పైగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు.
పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ రాసిన నాలుగు పేజీల లేఖను వారు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాలకు కూడా పంపారు.
ఇద్దరు జవాన్ల వీరమరణం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జరిగిన రెండు వేర్వేరు ఎదురు కాల్పుల ఘటనల్లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందగా, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ శనివారం నుంచి ఇక్కడ పర్యటించనున్నారు.
ఆయన పర్యటనకు ఒక రోజు ముందు ఈ ఎన్కౌంటర్లు చోటుచేసుకోవడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యా యి. కిష్టార్లో ఇద్దరు జవాన్లు అమరులు కాగా, కథువాలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.