Loksabha Elections 2024 : యూపీలోని కీలక నియోజకవర్గం అమేథిలో బీజేపీ ప్రచారం వేగవంతం చేసింది. కాంగ్రెస్ కంచుకోట అమేథిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తరపున బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మంగళవారం ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.
పెట్రోకెమికల్స్, ఆటోమొబైల్స్‌లో ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే మూడో స్ధానంలో ఉందని నడ్డా పేర్కొన్నారు. ఇవాళ మీ చేతుల్లో ఉన్న మొబైల్ ఫోన్లు భారత్‌లోనే తయారవుతున్నాయని చెప్పారు.
మారుతున్న నవభారతం ఇదేనని, మారుతున్న భారత్‌ను ఆవిష్కరించి మరింత బలోపేతం చేసేందుకు స్మృతి ఇరానీ చొరవ తీసుకుంటారని ఆమెకు అండగా నిలవాలని నడ్డా ఓటర్లను కోరారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వారణాసిలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
Read More :
Flight Journey | 110 రోజులు.. 200 విమానాల్లో ప్రయాణం.. ఎందుకంటే..?