శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 15:43:56

మాజీ సీఎం ప్రెస్‌మీట్‌కు హాజరైన జర్నలిస్ట్‌కు కరోనా పాజిటివ్‌

మాజీ సీఎం ప్రెస్‌మీట్‌కు హాజరైన జర్నలిస్ట్‌కు కరోనా పాజిటివ్‌

 భోపాల్‌:  మధ్యప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది.  ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా భోపాల్‌లో  55 ఏండ్ల జర్నలిస్టుకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.  ఇప్పటికే జర్నలిస్ట్‌ కూతురుకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలడంతో ఐసోలేషన్‌లో  చికిత్స అందిస్తున్నారు.  మార్చి 20న మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ నిర్వహించిన మీడియా సమావేశానికి   జర్నలిస్ట్‌ హాజరయ్యారు. 

జర్నలిస్ట్‌తో కలిసి తిరిగిన వారందరిని క్వారంటైన్‌కు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా కమల్‌నాథ్‌ను  క్వారంటైన్‌లో  ఉంచాలని  ఒత్తిడి పెరుగుతోంది.  ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు ప్రముఖ రాజకీయ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.  భోపాల్‌లో గత ఆదివారం తొలి కరోనా కేసు నమోదైంది. కరోనా సోకిన పేషెంట్‌ మార్చి 17న యూకే నుంచి వచ్చింది. logo