శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 08:31:47

దుండ‌గుల కాల్పుల్లో గాయ‌ప‌డ్డ‌ జ‌ర్న‌లిస్టు విక్ర‌మ్ జోషి మృతి

దుండ‌గుల కాల్పుల్లో గాయ‌ప‌డ్డ‌ జ‌ర్న‌లిస్టు విక్ర‌మ్ జోషి మృతి

ఘ‌జియాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లో దుండ‌గుల కాల్పుల్లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ జ‌ర్న‌లిస్టు విక్ర‌మ్ జోషి మృతిచెందారు. త‌న ఇద్ద‌రు కూతుళ్ల‌తో క‌లిసి బైక్ వెళ్తున్న విక్ర‌మ్ జోషిపై ఘజియాబాద్‌లోని విజ‌య్ న‌గ‌ర్ ప్రాంతంలో సోమ‌వారం రాత్రి 10.30 గంట‌ల‌కు ఐదుగురు వ్య‌క్తులు  కాల్పులు జ‌రిపారు. అత‌ని త‌ల‌కు గాయం కావ‌డంతో న‌గ‌రంలోని ఓ ప్రైవేట్ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈరోజు తెల్ల‌వారుజామున ఆయ‌న మ‌ర‌ణించార‌ని ద‌వాఖాన అధికారులు ప్ర‌క‌టించారు.  


ఈ దాడికి సంబంధించి సీసీటీవీలో రికార్డ‌య్యింది. ఆ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇద్ద‌రు పోలీసుల‌ను అధికారులు స‌స్పెండ్ చేశారు. అదేవిధంగా తొమ్మిది మంది నింధితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. జోషి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీస్‌ అధికారి కలానిధి నైతాని చెప్పారు. జోషి మేనకోడలు తరపు బంధువులు ఈ దాటికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు, పోలీసులు అనుమానిస్తున్నారు. 


తాజావార్తలు


logo