డెహ్రాడూన్, జూన్ 13: పురాణేతిహాసాల్లో ప్రసిద్ధిగాంచిన ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ పేరు మారింది. ఇక నుంచి దానిని అధికారికంగా జ్యోతిర్మఠ్గా వ్యవహరిస్తారు. పేరు మార్పునకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర వేసిందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది.
గత ఏడాది జరిగిన ఒక ఉత్సవంలో జోషిమఠ్ పేరును మార్చాలని స్థానికులు, పలు సంస్థలు విజ్ఞప్తి చేశాయి. బద్రీనాథ్ యాత్రికులకు ముఖద్వారంగా ఉన్న జోషిమఠ్‌లో ఆదిగురు శంకరాచార్య స్థాపించిన మఠాలలో కూడా ఒకటి.