లక్నో: పెద్ద జెయింట్ వీల్ ఎక్కిన బాలిక భారీ కుదుపునకు అదుపుతప్పింది. కూర్చొన్న సీటు నుంచి జారిపడింది. అదృష్టవశాత్తు జాయ్‌రైడ్ రాడ్‌ను ఆమె పట్టుకున్నది. భయంతో అరుస్తూ 60 అడుగుల ఎత్తులో ప్రమాదకరంగా వేలాడింది. (Girl Screams Dangling) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాకేహ్తి గ్రామంలో తిరునాళ్లు జరిగాయి. ఈ సందర్భంగా ఫెర్రిస్ వీల్ ఏర్పాటు చేశారు.
కాగా, 13 ఏళ్ల బాలిక ఆ భారీ జెయింట్ వీల్ ఎక్కింది. రైడ్ తర్వాత అది ఆగడంతో ఊహించని కుదుపునకు ఆ బాలిక బ్యాలెన్స్ తప్పింది. కూర్చొన్న సీటు నుంచి జారిపడింది. అయితే అదృష్టవశాత్తు జాయ్‌రైడ్ రాడ్‌ను ఆమె పట్టుకున్నది. భయంతో అరుస్తూ 60 అడుగుల ఎత్తు నుంచి ప్రమాదకరంగా వేలాడింది.
మరోవైపు ఆ జెయింట్ వీల్‌ను మెల్లగా తిప్పి కిందకు చేర్చారు. దీంతో ఆ బాలిక సురక్షితంగా కిందకు దిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై అధికారులు స్పందించారు. ఆ బాలికకు ఎలాంటి ప్రమాదం జరుగలేదని తెలిపారు. ఎలాంటి అనుమతి లేకుండా భారీ జెయింట్ వీల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
The girl got hung up on the big swing at the fair and kept swinging for about a minute, Lakhimpur Khiri
pic.twitter.com/nzNCIqkrYA— Ghar Ke Kalesh (@gharkekalesh) December 5, 2024