న్యూఢిల్లీ: భారత్-నేపాల్ సరిహద్దులో ఇరు దేశాల సైనికులు సంయుక్తంగా గస్తీ, గాలింపు చర్యలు చేపట్టారు. ఇరు దేశాల మధ్య ఉన్న అడవుల్లోకి పాకిస్థానీ ఉగ్రవాదులు చొరబడినట్లు భారత్‌కు సమాచారం అందింది. నేపాల్‌గంజ్‌లోని మర్కజ్‌కు పాకిస్థానీలు వస్తూ ఉంటారు.
ఈ నేపథ్యంలో భద్రతకు సంబంధించిన సమాచారాన్ని నేపాలీ దళాలు భారత దళాలకు అందజేస్తూ ఉంటాయి. భారత్-నేపాల్ మధ్య ఉన్న సుమారు 1,700 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులో కంచె లేదు. ఉగ్రవాదుల చొరబాటును నిరోధించేందుకు భారత్-నేపాల్ దళాలు కృషి చేస్తున్నాయి.