థానే:మహారాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ సహా తొమ్మిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల చేరికతో సీఎం ఏక్నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. ఎమ్మెల్యేల్లో భయం, ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో.. తన వర్గం మంత్రులు, ఎమ్మెల్యేలతో షిండే థానేలో సోమవారం నిర్వహించిన అంతర్గత సమావేశంలో తాజా పరిణామాలపై మంతనాలు చేసినట్టు తెలిసింది. ఎన్సీపీ మంత్రుల రాకతో నియోజకవర్గాలకు నిధులు, ఇతర అంశాలకు సంబంధించి ఎమ్మెల్యేల్లో నెలకొన్న భయాందోళనలను పరిష్కరించేందుకు షిండే ప్రయత్నం చేసినట్టు సమాచారం. మరోవైపు శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరేందుకు పార్టీ సమష్టిగా నిర్ణయం తీసుకొన్నదని అజిత్ పవార్ వర్గంలోని ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు.