భారీ ఉగ్ర కుట్ర భగ్నం
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రాజౌరీలోని కాండీ అటవీ ప్రాంతం చెట్ల పొదల్లో ఉగ్రవాదులు పాతిపెట్టిన 5 నుంచి 6 కిలోల ఐఈడీని నిర్వీర్యం చేసినట్టు ఆదివారం కశ్మీర్ జోన్ పోలీస్ ట్విట్టర్లో ప్రకటించింది.
- 5-6 కిలోల ఐఈడీ స్వాధీనం
న్యూఢిల్లీ, మే 7: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రాజౌరీలోని కాండీ అటవీ ప్రాంతం చెట్ల పొదల్లో ఉగ్రవాదులు పాతిపెట్టిన 5 నుంచి 6 కిలోల ఐఈడీని నిర్వీర్యం చేసినట్టు ఆదివారం కశ్మీర్ జోన్ పోలీస్ ట్విట్టర్లో ప్రకటించింది. రాజౌరీలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు చనిపోయిన సంగతి తెలిసిందే. బాంబు దాడి జరిగిన ఘటనా స్థలానికి సమీపంలోనే మరో బాంబును ఉగ్రవాదులు పాతిపెట్టిన విషయం పోలీసులకు తెలిసింది. పుల్వామా జిల్లాకు చెందిన ఇష్ఫాక్ అహ్మద్ వానీని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా ఐఈడీ బాంబు అమర్చిన సంగతి బయటపడింది. కాండీ అటవీ ప్రాంతంలో పోలీసులు, భద్రతా బలగాలు చేపట్టిన సెర్చింగ్ ఆపరేషన్ ఆదివారం కొనసాగింది. శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది చనిపోయాడని, ఉగ్రదాడి జరిగిన ప్రాంతమంతా భద్రతా బలగాల ఆధీనంలో ఉన్నదని, అన్ని దారులు మూసేసి ఉగ్రవేట కొనసాగిస్తున్నామని సీనియర్ సైనిక అధికారి ఒకరు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

