శ్రీనగర్: జడ్జిని బెదిరించారన్న ఆరోపణలపై జమ్ముకశ్మీర్ హైకోర్టు గందేర్బల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ శ్యామ్బిర్ సింగ్కు సమన్లు జారీ చేసింది. సోమవారం 11 గంటలకు కోర్టు ముందు హాజరు కావాలని జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ సంజీవ్ కుమార్ ధర్మాసనం ఆదేశించింది. గతంలో ఓ తీర్పును పాటించనందుకు ఆయన వేతనాన్ని అటాచ్ చేయాలని గందేర్బల్ సబ్ జడ్జి ఫయాజ్ అహ్మద్ ఖురేషీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శ్యామ్బిర్ తన అధికార దుర్వినియోగంతో ప్రతీకారానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి.