Jitan Ram Manjhi : ఈవీఎంలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటనపై కేంద్ర మంత్రి జితన్ రాం మాంఝీ స్పందించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, విపక్షాలు కేవలం తమ వినోదం కోసం ఈవీఎంలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమైతే వారికి అన్ని సీట్లు ఎలా వచ్చేవని ఆయన ప్రశ్నించారు. ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తుతూ వారు తమ బలహీనతను బయటపెట్టుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.
రాజ్యాంగం ప్రమాదంలో పడిందని గగ్గోలు పెట్టిన తరహాలో ఈవీఎంలపైనా విపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.
Read More :
సల్మాన్ హత్యకు స్కెచ్ : యూట్యూబ్ వీడియోలో చర్చించిన వ్యక్తి అరెస్ట్