న్యూఢిల్లీ, మే 24: పరువు నష్టం కేసులో జార్ఖండ్‌లోని చైబాసా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. జూన్ 26న న్యాయస్థానం ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ రా హుల్ న్యాయవాది చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది.
‘హత్యా నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సైతం బీజేపీ అధ్యక్షుడు కావొచ్చు’ అంటూ అప్పటి పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను ఉద్దేశించి 2018లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీలో రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. దీనిపై బీజేపీ నేత ప్రతాప్ కతియార్ వేసిన పరువునష్టం కేసుపై న్యాయస్థానం విచారణ సాగిస్తున్నది.