Hemant Soren | హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఐదునెలల తర్వాత మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. భూకుంభకోణం కేసులో ఆయనను జనవరిలో ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన చంపై సోరెన్ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. దాంతో ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం ఆయన మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 8న కేబినెట్‌ను విస్తరించనున్నారు. గత గురువారం రాజ్‌భవన్‌లో హేమంత్ సోరెన్ ఒక్కరే సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2019 నుంచి ప్రస్తుత మహాఘటబంధన్ ప్రభుత్వం జార్ఖండ్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అన్ని పనులు చేసిందన్నారు.
రాజకీయ ఒడిదుడుకుల సమయంలో చంపై సోరెన్ ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లారన్నారు. తాజాగా కోర్టు ఆదేశాలతో బయటకు రాగలిగానని.. మరో వైపు జార్ఖండ్‌లో ఈ ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం నేత సోరెన్ ఇండియా కూటమి నేతగా ఉంటారని అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా హేమంత్ సోరెన్ ను ఐదునెలల పాటు జైలులో ఉంచారని అజయ్ కుమార్ ఆరోపించారు. దాంతో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు. జూన్ 28న హేమంత్ సోరెన్‌కు హైకోర్టు నుంచి బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ జనవరి 31న హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసింది. అరెస్టుకు ముందు ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు.