హౌరా: పశ్చిమ బెంగాల్లో ఆగంతకుల దాడిలో జార్ఖండ్‌కు చెందిన నటి హత్యకు గురయ్యారు. బుధవారం మహిష్రేఖ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నటి రియా కుమారి తన భర్త, నిర్మాత ప్రకాశ్‌కుమార్‌తో పాటు వారి రెండేండ్ల పాపతో కారులో వెళ్తుండగా.. ముగ్గురు వ్యక్తులు వాహనాన్ని అడ్డగించారు.
ప్రకాశ్కుమార్పై దాడి చేసిన అగంతకులు అతని వద్దనున్న సొమ్మును దొంగిలించే ప్రయత్నం చేశారు. దీంతో రియాకుమారి అడ్డుకొనే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో దుండగులు ఆమెపై కాల్పులు జరుపడంతో మరణించారు.