న్యూఢిల్లీ : జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం ప్రకటించింది. వచ్చే నెల 2 నుంచి దేశవ్యాప్తంగానూ, 15 విదేశీ నగరాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పేపర్ 1 (బీఈ/బీటెక్) పరీక్షను రోజూ రెండు షిఫ్టుల్లోనూ, పేపర్ 2ఏ (బీఆర్క్), పేపర్ 2బీ (బీ ప్లానింగ్)లను సింగిల్ షిఫ్ట్లోనూ నిర్వహిస్తారు. ఏప్రిల్ 2, 3, 4, 7 తేదీల్లో పేపర్ 1 (బీఈ/బీటెక్) పరీక్ష జరుగుతుంది.
మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి జరుగుతుంది. పేపర్ 1 (బీఈ/బీటెక్) పరీక్ష ఏప్రిల్ 8న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. వచ్చే నెల 9న ఉదయం 9 గంటలకు పేపర్ 2ఏ (బీఆర్క్), పేపర్ 2బీ (బీ ప్లానింగ్), పేపర్ 2ఏ, 2బీ (బీఆర్క్ మరియు బీ ప్లానింగ్) పరీక్షలు జరుగుతాయి. www.nta.ac.in వెబ్సైట్లో పరీక్షల తాజా వివరాలను తెలుసుకోవచ్చు.