హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో నాలుగేండ్ల బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షను జాతీయంగా 2025 మే 18న నిర్వహించనున్నట్టు ఐఐటీ కాన్పూర్ తెలిసింది. అడ్వాన్స్డ్ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్-2కు పరీక్షను నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరవడం తప్పనిసరి. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్స్ విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 23 ఐఐటీలుండగా, వీటిల్లో 17,740 బీటెక్ సీట్లున్నాయి.