‘Narendra Modi Constitution’ | బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగం పేరు మార్పు : జేడీయూ
దేశంలో పలు సంస్ధల పేర్లను మోదీ సర్కార్ మార్చడం పట్ల జేడీ(యూ) అధ్యక్షుడు లలన్ సింగ్ మండిపడ్డారు. 2024లో తిరిగి నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుతీరితే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని నరేంద్ర మోదీ (Narendra Modi Constitution) రాజ్యాంగంగా మార్చేస్తారని దుయ్యబట్టారు.
పట్నా : దేశంలో పలు సంస్ధల పేర్లను మోదీ సర్కార్ మార్చడం పట్ల జేడీ(యూ) అధ్యక్షుడు లలన్ సింగ్ మండిపడ్డారు. 2024లో తిరిగి నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుతీరితే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని నరేంద్ర మోదీ (Narendra Modi Constitution) రాజ్యాంగంగా మార్చేస్తారని దుయ్యబట్టారు. బిహార్లోని నలందలో జరిగిన ఓ కార్యక్రమంలో లలన్ సింగ్ పాల్గొన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ గెలిస్తే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని నరేంద్ర మోదీ రాజ్యాంగంగా మార్చేస్తారని ఆరోపించారు. గత తొమ్మిదేండ్లుగా దేశంలో ఏం అభివృద్ధి పనులు చేపట్టారో ప్రధాని మోదీ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో పలు సంస్ధల పేర్లను మార్చేశారని, నగరాలు, రైల్వేస్టేషన్లు, ద్వీపాలు సహా పలు పేర్లను మార్చడమే పనిగా పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని చారిత్రక రాజ్పథ్ను కర్తవ్యపథ్గా మార్చారని గుర్తుచేశారు.
Read More :
Sonia Gandhi | రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం అత్యంత దారుణంగా ముగిసింది.. కానీ, : సోనియా గాంధీ
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- JDU
- Lalan Singh
- Pm Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

