బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను (Prajwal Revanna) బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రజ్వల్‌ను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ భద్రత నడుమ విచారణ నిమిత్తం సీఐడీ కార్యాలయానికి తరలించారు.
ఎన్డీయే కూటమి తరఫున హాసన పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. అయితే పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దీంతో గత ఏప్రిల్‌లో ఆయన దేశం విడిచి పారిపోయారు. ఇప్పటివరకు ఆయనపై మూడు కేసులు నమోదయ్యాయి.
ఈనేపథ్యంలో ప్రజ్వల్‌కు నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్ నోటీసు, రెడ్ కార్నర్ నోటీసులు జారీఅయ్యాయి. పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. అయితే విచారణకు హాజరుకావాలని ఆయన తాత, మాజీ ప్రధాని దేవెగౌడ, తండ్రి హెచ్డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బహిరంగంగానే ప్రజ్వల్‌ను కోరిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 31న సిట్ ముందు హాజరవుతానంటూ గత సోమవారం (27వ తేదీన) వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జర్మనీ నుంచి ఆయన బెంగళూరుకు వచ్చారు. వచ్చీరాగానే పోలీసులు అరెస్టుచేశారు.
Karnataka | Suspended JD(S) leader Prajwal Revanna, who is facing sexual abuse charges was arrested by SIT at Bengaluru’s Kempegowda International Airport.
(Screengrabs from a viral video) pic.twitter.com/A8KcRjtoLu
— ANI (@ANI) May 30, 2024
Nearly a month after JD(S) suspended #Hassan MP Prajwal Revanna lands at Kempegowda International Airport, #Bengaluru
Security was tightened at the airport.
Revanna to face a probe by SIT, for allegedly assaulted several women and filmed.#PrajwalRevanna #Karnataka pic.twitter.com/L7VT5SPIkP
— Surya Reddy (@jsuryareddy) May 30, 2024
Suspended #JDS leader #PrajwalRevanna Returns From #Germany, Arrested In Sex Crimes Case.#Hassan MP Prajwal Revanna – who fled to Germany last month, shortly after sex crimes allegations by women who said he forced them into sexual acts that were then filmed – was arrested just… pic.twitter.com/xvDR0Q8qBA
— Hate Detector 🔍 (@HateDetectors) May 30, 2024