‘కానిస్టేబుల్ కనకం’ నాకెంతో ప్రత్యేకం. ఇంతటి అద్భుతమైన భావోద్వేగపూరిత కథకు నన్ను ఎంపిక చేసిన దర్శకుడు ప్రశాంత్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కథానుగుణంగా, సాంకేతికంగా తొలి సీజన్‌ని మించి ఈ మలి సీజన్ ఉంటుంది. సీజన్ 3 కూడా చేయాలనుకుంటున్నా. ఈ నెల 8 నుంచి ఈ టీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి. బాగా ఎంజాయ్ చేస్తారు.’ అని కథానాయిక వర్ష బొల్లమ్మ అన్నారు. ఆమె ప్రధాన పాత్ర పోషించిన థ్రిల్లర్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’కు సెకండ్ సీజన్‌గా ‘కానిస్టేబుల్ కనకం 2’ రూపొందింది.
రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రధారులు. ప్రశాంత్‌కుమార్ దిమ్మల దర్శకుడు. కోవెలమూడి సత్యసాయిబాబా, వేమూరి హేమంత్‌కుమార్ నిర్మాతలు. ఈ నెల 8న ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో వర్ష బొల్లమ్మ మాట్లాడింది. సీజన్ 1లో విడిచిపెట్టిన ప్రశ్నలకు ఈ సీజన్ 2 సమాధానాలివ్వనున్నదని, ఆ సమాధానాలు ఉత్కంఠభరితంగా ఉంటాయని, ఇంతటి ఎక్సైటింగ్ జర్నీలో నాతోపాటు ప్రయాణించిన టీమ్ అందరికీ ధన్యవాదాలని దర్శకుడు ప్రశాంత్కమార్ దిమ్మల తెలిపారు. ఇంకా చిత్రబృందంతోపాటు ఈటీవీ విన్ ప్రతినిథులు కూడా మాట్లాడారు.