యాక్షన్ కింగ్ అర్జున్ స్వీయ దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సీతా పయనం’. నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్‌రాజ్, కోవై సరళ ఇతర ప్రధాన పాత్రధారులు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్నది. వాలెండైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు.
చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రేయాఘోషల్ ఆలపించారు. అనూప్‌రూబెన్స్ స్వరకర్త. హృద్యమైన ప్రేమకథా చిత్రమిదని, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌రూబెన్స్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకుడు: అర్జున్.