బెంగుళూరు: కర్నాటక మాజీ మంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ రేవణ్ణ(HD Revanna)కు ఇవాళ బెంగుళూరులోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరీ చేసింది. లైంగిక వేధింపుల కేసులో ఆయనకు బెయిల్ జారీ చేశారు. హోలెనర్సిపురా పోలీసు స్టేషన్లో హెచ్డీ రేవణ్ణతో పాటు ప్రజ్వల్ రేవణ్ణపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఎంపీలు, ఎమ్మెల్యేలకు చెందిన ప్రత్యేక కోర్టు ఈ కేసులో విచారణ చేపట్టింది. తాత్కాలిక మధ్యంతర బెయిల్‌ను మంజూరీ చేస్తున్నట్లు కోర్టు చెప్పింది.