బెంగళూర్ : 2024 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీతో తమ పార్టీ పొత్తుపై జేడీ(ఎస్) చీఫ్ దేవెగౌడ (Deve Gowda) బుధవారం స్పందించారు. తమ పార్టీకి అధికార దాహం లేదని, కర్నాటకలో రాజకీయ పరిస్ధితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూలంకషంగా వివరించానని చెప్పారు.
తాము అధికార దాహంతో వ్యవహరించే రాజకీయ నేతలం కాదని, తాను ఇంతవరకూ ప్రధాని నరేంద్ర మోదీని కలవలేదని, గత పదేండ్లలో తొలిసారిగా కర్నాటక రాజకీయాల గురించి తాను అమిత్ షాతో చర్చించానని దేవెగౌడ చెప్పుకొచ్చారు. నూతన పొత్తుపై పార్టీల్లో విభేదాలు వ్యక్తమవుతున్నాయనే వార్తల నడుమ జేడీ(ఎస్) చీఫ్ వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది.
బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తూ ఇద్దరు జేడీ(ఎస్) నేతలు ఇప్పటికే రాజీనామా చేయగా, పలువురు ముస్లిం నేతలు పార్టీని వీడతామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు కర్నాటకలో కమలం కకావికలం కావడంతోనే జేడీ(ఎస్)తో బీజేపీ చేతులు కలిపిందని, ఇరు పార్టీలు ఒక్కటైనా లోక్సభ ఎన్నికల్లో కర్నాటకలో కాంగ్రెస్ సత్తా చాటుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read More :
BJP hate speech | విద్వేష ప్రసంగాల్లో బీజేపీనే టాప్.. హిందూత్వ వాచ్ సంస్థ వెల్లడి