హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల కొనసాగుతున్నది. కాగా, మంచిర్యాల జిల్లా క్యాతంపల్లి(Kyathannapalli) మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. గడువు సమయానికి కౌన్సిలర్లు రాలేదని అధికారులు రేపటికి వాయిదా వేశారు. అయితే క్యాతన్పల్లిమున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల వాయిదాకు మంత్రి వివేక్ కుట్రలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో క్యాతంపల్లి మున్సిపల్ కార్యాలయానికి డిసిసి అధ్యక్షుడు రఘనాథ్ రెడ్డి చేరుకోవడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. మంత్రి వివేక్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.