ఆర్మీ జవాన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎర్రటి ఎండలో వేడిని తట్టుకుంటూ.. గడ్డ కట్టే చలిలో వణుకుతూ వాళ్లు బార్డర్ వద్ద దేశం కోసం కాపలా కాస్తుంటారు. జవాన్లే లేకపోతే ఈ దేశం ఇలా ఉండదు. దేశాన్ని కంటికి రెప్పలా తమ ప్రాణాలకు తెగించి మరీ కాపాడుకుంటూ వస్తున్నారు జవాన్లు.
తాజాగా.. మోకాళ్ల లోతు మంచులో జవాన్లు సరదాగా వాలీబాల్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ఐఏఎస్ ఆఫీసర్ అవానిష్ శరణ్ షేర్ చేశారు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. జవాన్ల ఫిట్నెస్ లేవల్సే వేరు. ఎర్రటి ఎండలోనైనా.. గడ్డ కట్టే చలిలోనైనా.. కుండపోత వర్షంలోనైనా అలాగే దృఢంగా ఉండగలిగేంత శక్తి వాళ్లకు ఉంది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.