న్యూఢిల్లీ: వందేమాతరం(Vande Mataram) గీతానికి 150 ఏళ్లు నిండిన నేపథ్యంలో ఇవాళ లోక్‌సభలో ఆ అంశంపై చర్చ చేపట్టారు. ఆ చర్చలో పాల్గొన్న ప్రధాని మోదీ.. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వైఖరిని తప్పుపట్టారు. జాతీయ గేయం వందేమాతరాన్ని కాంగ్రెస్ ముక్కలు ముక్కలు చేసిందని, ఎందుకంటే ముస్లింలను రెచ్చగొడుతుందన్న ఉద్దేశంతో ఆ గేయాన్ని ముక్కలు చేశారని మోదీ అన్నారు. లోక్‌సభలో ప్రధాని మోదీ ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో అధికార పార్టీ సభ్యులు సిగ్గు సిగ్గు అంటూ అరిచారు. గడిచిన శతాబ్ధంలో కొన్ని శక్తులు జాతీయ గేయం పట్ల మోసానికి పాల్పడినట్లు ప్రధాని చెప్పారు.
జాతీయ గేయాన్ని ముక్కలు చేసిందెవరన్న విషయాన్ని రాబోయే తరాలకు తెలియజేయాలని, మొహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ 1937లో వందేమాతరం గేయానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిందని, కానీ కాంగ్రెస్ పార్టీ, నేహ్రూ ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించలేదని, బదులుగా వందేమాతరం గీతాన్ని ముక్కలు చేశారని ఆరోపించారు. వందేమాతరాన్ని జిన్నా వ్యతిరేకించిన తర్వాత నెహ్రూకు సుభాష్ చంద్ర బోస్ లేఖ రాశారని, అయితే ఆ గేయం ముస్లింలను చిరాకు పరిచే రీతిలో ఉన్నట్లు ఉందని నెహ్రూ పేర్కొన్నారన్నారు. ఎమర్జెన్సీ పాలన సమయంలోనూ వందేమాతరం గీతానికి వందేళ్లు నిండాయని, కానీ ఆ సమయంలో రాజ్యాంగం తీవ్ర వేదనకు గురైందన్నారు.
బెంగాలీ రచయిత బంకిమ్ చంద్ర ఛటర్జీ 1875లో వందేమాతరం గీతాన్ని రాశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో ఆ సాంగ్ కీలక పాత్ర పోషించింది. వందేమాతరం గేయంలో తొలి రెండు చరణాలు మాత్రమే వాడాలని 1937లో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసింది. గేయంలో ఉన్న హిందూ దేవతల ప్రస్తావన ముస్లింలకు నచ్చడం లేదని, అందుకే పూర్తి గేయాన్ని వాడవద్దు అని అప్పట్లో నెహ్రూ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అన్ని జాతీయ మీటింగ్‌ల్లో కేవలం తొలి రెండు చరణాలను మాత్రమే పాడడం మొదలుపెట్టారు. వందేమాతరం గీతంతో విభజన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ .. ఎప్పుడో దేశవిభజనకు బీజం వేసిందని మోదీ తన ప్రసంగంలో అన్నారు. ఇది నేటి తరం అర్థం చేసుకోవాలన్నారు.
వందేమాతం గీతంలో దుర్గామాతపై ఉన్న చరణాలను నెహ్రూ కావాలని తొలగించినట్లు ఇటీవల బీజేపీ ప్రతినిధి సీఆర్ కేశవన్ ఆరోపించారు. 1937లో నెహ్రూకు నేతాజీ రాసిన లేఖలను ఆయన తన ఎక్స్‌లో తాజాగా పోస్టు చేశారు.
7- How Vande Mataram was betrayed by Nehru: its paragraphs were omitted, citing that Muslims would get offended.
You will not believe how low Congress stooped to appease Muslims and mock Hindus. pic.twitter.com/HU8SZkNY9L
— Political Kida (@PoliticalKida) December 8, 2025