ఇండోర్: ఆర్ఎస్ఎస్ మాజీ ప్రచారక్ అభయ్ జైన్ స్థాపించిన జనహిత పార్టీ మధ్యప్రదేశ్ అసెంబ్లీకి పోటీ చేసే 8 మంది అభ్యర్థుల లిస్టును శుక్రవారం విడుదల చేసింది.
కొత్తగా ఏర్పడిన తమ పార్టీకి ఇంకా గుర్తు కేటాయించనందున తమ వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తారని అభయ్ జైన్ తెలిపారు. తన పార్టీలో తనతో సహా ఆరుగురు మాజీ ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌లు ఉన్నారన్నారు.