సోమవారం 01 జూన్ 2020
National - May 08, 2020 , 11:19:07

' భారత ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు '

' భారత ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు '

బంగ్లాదేశ్ : లా క్ డౌన్ తో బంగ్లాదేశ్ లో చిక్కుకుపోయిన జ‌మ్మూక‌శ్మీర్ విద్యార్థుల‌ను భార‌త ప్ర‌భుత్వం స్వ‌స్థ‌లానికి తీసుకొస్తుంది. ఢాకా నుంచి జ‌మ్మూక‌శ్మీర్ వ‌స్తోన్న ఓ విద్యార్థిని మీడియాతో మాట్లాడుతూ..ఢాకాలోని మెడిక‌ల్ కాలేజీలో చ‌దువుతున్నాను. మా ప్రిన్సిప‌ల్ రోష‌న్ అలీ బంగ్లాదేశ్ లోని భార‌త రాయ‌బార కార్యాల‌యం అధికారుల‌ను సంప్ర‌దించారు. మమ్మ‌ల్ని ఇండియాకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని కోరారు.

వందేభార‌త్ మిష‌న్ లో భాగంగా బంగ్లాదేశ్ అధికారులు, రాయ‌బార కార్యాల‌య అధికారులు స‌హ‌క‌రించి త‌మ‌ను ఇండ్ల‌కు తీసుకొస్తుండ‌టం ఆనందంగా ఉంది. లాక్ డౌన్ స‌మ‌యంలో త‌మ‌కు స‌హ‌క‌రించిన అధికారులంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాన‌ని చెప్పింది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo