Jammu Kashmir | జమ్మూ డివిజన్లోని రాజోరి జిల్లా నౌషేరా సెక్టార్లో భారత్-పాకిస్తాన్ నియంత్రణ రేఖ సమీపంలో పేలుడు సంభవించింది. ఆ ప్రాంతంలో ఆర్మీ జవాన్లు గస్తీ తిరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ప్రమాదవశాత్తు ఓ సైనికుడి కాలు ప్రమాదవశాత్తు ల్యాండ్‌మైన్ పడడంతో పేలుడు జరిగింది. ఈ ఘటనలో సైనికుడు తీవ్రంగా గాయపడ్డగా.. ఝంగర్కు.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్లో ఉదయంపూర్ కమాండ్ ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన సైనికుడిగా నాయక్ ధీరజ్ కుమార్‌గా గుర్తించారు. ఇదిలా ఉండగా.. అనంత్‌నాగ్ వాహనంలో పేలుడు చోటుచేసుకోగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. లర్కిరా ప్రాంతంలో బుధవారం వాహనంలో అనుమానాస్పదంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కొందరు గాయపడ్డారు. స్థానిక మార్కెట్‌కు సమీపంలో ఈ ఉదయం పేలుడు సంభవించిందని, దీనితో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన వారికి వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి చికిత్స అందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.