న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో త్వరలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసి లఢఖ్ను వేరుచేసి జమ్ముకశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది కేంద్ర ప్రభుత్వం. 2018లో పీడీఎఫ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నప్పటి నుంచి జమ్ము కశ్మీర్లో ప్రభుత్వం లేదు. మూడేండ్ల తర్వాత ఈసీ జమ్ముకశ్మీర్‌లో ఇటీవల ఓటరు జాబితా సవరణ చేపట్టి నవంబరు 25న తుది జాబితాను విడుదల చేసింది. అసెంబ్లీ స్థానాలను కూడా 83 నుంచి 90కు పెంచింది. దీంతో త్వరలోనే జమ్ము కశ్మీర్‌కు ఎన్నికలు జరగనున్నాయనే ప్రచారం జరుగుతున్నది.