వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో జమిలి బిల్లు?
దేశవ్యాప్తంగా రాష్ర్టాల అసెంబ్లీలకు, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు (జమిలి ఎన్నికలు) నిర్వహించడానికి కేంద్రంలోని ఎన్డీయే సర్కారు అడుగులు వేస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది.
- కేంద్రం వ్యూహాత్మక అడుగులపై చర్చ
హైదరాబాద్, అక్టోబర్ 29 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా రాష్ర్టాల అసెంబ్లీలకు, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు (జమిలి ఎన్నికలు) నిర్వహించడానికి కేంద్రంలోని ఎన్డీయే సర్కారు అడుగులు వేస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. వచ్చే ఏడాది జనగణన నిర్వహించి, 2026లో జనాభా లెక్కలను ప్రకటిస్తామని సోమవారం కేంద్రం ప్రకటించింది.
2028లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని వెల్లడించింది. మరోవైపు, ‘ఒకే దేశం – ఒకే ఎన్నికల’కు సానుకూలంగా మాజీ రాష్ట్రపతి కోవింద్ ఇచ్చిన నివేదికకు గత నెలలోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించింది. దీంతో మిత్రపక్షాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలికి సంబంధించిన బిల్లును ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
కాగా జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో 18 వరకూ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఏకకాల ఎన్నికల నిర్వహణకు లాజిస్టిక్స్ సమస్య కూడా ఎదురవ్వొచ్చని నిపుణులు చెప్తున్నారు. జమిలి బిల్లుకు ఎన్డీయేలోని ప్రాంతీయ పార్టీలు సానుకూలంగా ఓటేస్తాయా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

