శుక్రవారం 05 జూన్ 2020
National - May 07, 2020 , 20:55:42

జూలై ఒకటి నుంచి జామియా మిలియా పరీక్షలు

జూలై ఒకటి నుంచి జామియా మిలియా పరీక్షలు

న్యూఢిల్లీ: ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు జూలై ఒకటో తేదీ  నుంచి నిర్వహించేందుకు నిర్ణయించినట్లు  జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన అకాడమిక్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి కేవలం ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు మాత్రమే పరీక్షలను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్టు పేర్కొన్నది. ఫైనల్‌ సెమిస్టర్‌ విద్యార్థులు తమ అసైన్‌మెంట్లను వచ్చే నెల  ఐదో తేదీలోగా అందజేయాలని సూచించారు. అలాగే ఈ నెల 31 వరకు ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగించాలని కూడా నిర్ణయించారు. ఆగస్లు ఒకటో తేదీ నుంచి కొత్త  విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని యూనివర్సిటీ పేర్కొన్నది.


logo