న్యూఢిల్లీ: భారత్, కెనడా సంబంధాలు క్లిష్టదశలో ఉన్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. భారత వ్యవహారాల్లో కెనడా దౌత్య సిబ్బంది నిరంతరం జోక్యం చేసుకుంటున్నారనే ఆందోళనలున్నాయని, ఈ నేపథ్యంలోనే సిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం ఉండాలని కోరామన్నారు.
దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని భారత్ అల్టిమేటం జారీచేసిన నేపథ్యంలో కెనడా 41 మంది సిబ్బందిని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, కెనడాలోని భారత దౌత్యవేత్తల భద్రత విషయంలో పురోగతి కనిపిస్తే.. వీసాల జారీ ప్రక్రియ పునఃప్రారంభిస్తామని జైశంకర్ చెప్పారు.