Jairam Ramesh | నవీన్ జిందాల్ నిష్క్రమణపై జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
Jairam Ramesh : మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కాంగ్రెస్‌ను వీడి కాషాయ పార్టీలో చేరడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు.
Jairam Ramesh : మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కాంగ్రెస్‌ను వీడి కాషాయ పార్టీలో చేరడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ రహిత భారత్‌ను కోరుకుంటున్నారని, కానీ ఆయన అవినీతి రహిత కాంగ్రెస్‌ను తయారుచేస్తున్నారని వ్యాఖ్యానించారు. మీకు భారీ వాషింగ్ మెషీన్ అవసరమైనప్పుడు ఇలా జరుగుతుంది..గత పదేండ్లుగా పార్టీకి ఎలాంటి సేవలందించని మీరు ఇప్పుడు రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం పెద్ద జోక్ అని నవీన్ జిందాల్‌ను ఉద్దేశించి జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
మనీ ల్యాండరింగ్ కేసులో సంబంధం ఉందనే ఆరోపణలపై జిందాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసిన వార్తా పత్రికల క్లిప్పింగ్స్ స్క్రీన్ షాట్స్‌ను జైరాం రమేష్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రధాని కాంగ్రెస్ రహిత భారత్‌ను కోరుకుంటున్నారు..కానీ ఆయన అవినీతి రహిత కాంగ్రెస్‌ను తయారుచేస్తున్నారని మరో పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈడీ, సీబీఐతో పాటు పలు వాషింగ్మెషీన్స్తో కాంగ్రెస్ నేతలను ప్రక్షాళన చేసి కాషాయ పార్టలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నవీన్ జిందాల్ ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాషాయ గూటికి చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో దేశాభివృద్ధికి పాటుపడేందుకు గర్వంగా ఉందని నవీన్ జిందాల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ కలను సాకారం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాగా, నవీన్ జిందాల్ హరియాణలోని కురుక్షేత్ర నుంచి బీజేపీ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల బరిలో దిగనున్నారు.
Read More :
Kothagudem | సర్కారు తోటలో తటాకం.. లీజుమాటున కంట్రాక్టర్ నిర్వాకం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
Aadarsha Kutumbam | మూడు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ జోరు!
RC 17 | రామ్ చరణ్ ‘ఆర్సీ 17’పై మరో ప్రచారం.. గుజరాతీ బ్లాక్‌బస్టర్ రీమేక్ అంటూ టాక్స్..!
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

